శిస్యుల పట్టీలో నమోదుచేయబడుట

10తుదకు ప్రభువుయొక్క మహాశక్తినిబట్టి ఆయనయందు బలవంతులై యుండుడి.౹ 11మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి.౹ 12ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.౹ 13అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చినవారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి౹ (ఎపేసి 6:10-13)

   ఐక్యరాజ్య సైనికులుగా ఒక వ్యక్తి తనపేరు నమోదు చేసుకొనుటకు ఎంతో భాద్యతకు కట్టుబాట్లకు ఒప్పుకొని తనపని కొరకైనా పిలుపుకు చాలా విలువనిచ్చును. వారికి ఇవ్వబడిన ఆదేశాలను అనుసరించి అప్పజెప్ప బడిన మిషన్ ను పూర్తి చేస్తాడు. ఒకసైనికునిగా నీ సవాలు ఏమిటంటే నీకు అప్పజెప్పబడిన పనిని నీ కున్న తలాంతులను గొప్పగా ఉపయోగించగలగాలి. దినములు గడిచే కొలది నీలో ఇమిడివున్న గొప్ప తలాంతులను నీవు గుర్తించగలుగుతావు.

   నేను ఖచ్చితంగా చెప్పగలను, ప్రతి దేశం తనదేశ పౌరులకు ఇచ్చే శిక్షణలో వారిలో మార్పు తేవాలని ఆశిస్తుంది అన్నిటి కంటే ముఖ్యముగా పౌరులు ఈ పోరాటంలో తమ సొంత కోరికలు ఇచ్చలను సహితము త్యాగం చేస్తారు. ఈ విదంగా స్వచ్చందంగా దేశం కొరకు పోరాడుటకు పనిచేయుటకు ఒక సైన్యం సమకూర్చ బడుతుంది. శిక్షణ పొందుటకు పోరాడుటకు ఏర్పరచబడుట. ప్రతి సైనికుడి నిబద్ధత తనకు ఇవ్వబడిన లక్ష్యానికి సంబంధించి ఉంటుంది, మరియు వారి నాయకుడి యడల అంకితభావం, వారి దేశము యడల ప్రేమ.

     ఇది మనకందరికీ అర్థము కాని కష్టమైన సూత్రం కాదు. సైన్య నివాసాల యొద్ద ఎక్కువ దినములు గడిపిన నాకు ఏ విధమైన సైనికునిగా నేను వుండగలనో అని ఆలోచిస్తుంటాను. ఈ విధమైన కఠిన శిక్షను నేను భరించగలనా? ఆ బాషను నేర్పుతో, ఆ యుక్తులను గ్రహించగలనా? నా భలమును, శక్తిని, ఓర్చుకొను శక్తిని నా పనిలో చూపగలనా? నేను ఇంతవరకు ఎదుర్కొనని ముఖాముకీగా చూడని నాయకుని కొరకు మనస్పూర్తిగా నన్ను నేను అంకితం చేసుకో గలనా?

     కాని ఇటువంటి ఆలోచనలు నామనసున ఎక్కువగా రానివ్వను ఎందుకంటే నేను ఈ పోరాటంలో బాగస్తునిగా ఉండుటకు ఆ నాయకుడి క్రింద ఆయన ఆజ్ఞలను విధానాలను అవలంబించుటకు ఇష్టపడుచున్నాను. ఎందుకంటే ఆయన రాజు, నా యజమాని త్వరలో ఆయనను ముఖాముకిగా ఎదుర్కొనబోవుచ్చున్నాను.

     మన రాజు పిలుపుకు మనము లోబడి ఆయనకు ఒక గొప్ప శిష్యరికపు సైన్యముగా నిలబడినాము బాప్తిస్మము ద్వారా ఒక నిబంధన చేసితిమి. సర్వాంగ కవచము ధరించి, కనిపెట్టి మంచి పోరాటం పోరాడవలసి వున్నది.

     మన పరిచర్య పోరాటం ఒక ప్రత్యేక సరిహద్దు కలిగినది కాదు మన పోరాటం రాజకీయ, రాష్ట్రీయ, భౌగోళిక హద్దులు ఏర్పరచిన మనుషుల తలంపులకు అతీతమైనది. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన గృహాల్లో గుంపులతో గూడిన దళాలు మన సైన్యము. ఈ రాజ్యమును అందులోని పౌరులను సర్వనాశనం చేయాలని పూనుకున్న విరోధితో మనం కలిసికట్టుగా ఆకరి వరకు పోరాడాలి. ఈ ప్రపంచంలో మనము ఏ స్థలములో వున్నను, ఏ పని చేస్తున్నను, మన రాజు రాక కోరకు ఈ యుద్ధములో పొందబోయే విజయాన్ని మన రాజుతో సంతోషముగా అనుభవించుట కొరకు ఎదురుచూస్తున్నాము "సీయోను కుమారి సంతోషించి ఉత్సాహధ్వని చేయుము. నేను వచ్చి మీమధ్య నివసింతును" అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

    అనేక దేశముల ప్రజలు కూడివచ్చి నిలుతురు. వారు నా ప్రజలని పిలువబడుదురు. నేను వారిమధ్య నివసింతును.(జకర్య 210;11) మనం ఒంటరిగా పోరాటం చేయుట లేదు అని గతకాలపు గాధలు వివరిస్తున్నాయి చరిత్ర చెప్పిన సత్యం ఏమిటంటే మన సైన్యం దానిలో ఓపికతో పోరాడిన సైనికుల జీవితాలు రానున్న తరాలకు ఒకగొప్ప మాదిరిగా వున్నారు అన్న సత్యము ఎంతో అద్భుతం వీరెవరూ అంటే పురుషులు, స్త్రీలలో ఉన్న ప్రవక్తలు, సమస్తమైన యాజకులు, రాజులు, అపోస్టలలు, శిష్యులు,నమ్మకమైన సమకూర్చువారు,మార్గదర్శకులు, భోదకులు, ప్రకటించువారు, వీరు పౌలు ఒప్పుకోలు వలె మంచి పోరాటం పోరాడితిని. నా పరుగు కడముట్టటించితిని, విశ్వాసం కాపాడుకొంటిని (2తిమోతి 4:7) కాబట్టి మన దృష్టి దర్శనం విజయముపై ఉండాలి. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనలను ఆవరించి నందున మనము కూడా ప్రతి బారమును సులువుగా చిక్కులు బెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడనైన యేసు వైపు చూచుచు మనయెదుట ఉంచబడిన పందేములో ఓపికతో పరుగెత్తుదము (హెబ్రీ 12:1-2).

     ఈ ప్రధానులు, సైనికులు నమ్మకమైన సాధువులు మన పరుగులో మనకు ఉల్లాసకరమైన వాతవరణమును కలిగిస్తారు.

      నేను గొప్ప సైనికుడను అని నీకు నీవు ప్రకటించుకుంటే మోసపోయినట్లే ఈ విధానములో నీవు నిజమైన సైనికునిగా ఉండాలంటే శత్రువు యొక్క పన్నాగాలను అర్థం చేసుకుని దానికి విరుగుడుగా రాజు చెప్పే ప్రణాలికను గ్రహించి లోబడాలి. నాయకుని మంచి శిష్యునిగా నిన్ను నీవు సిద్ధపరుచుకోవాలి. ఈ యుద్ధానికి కావలసిన కవచము ఇవ్వబడింది, యుద్ధములో విరోధులు గురించి తెలుపబడింది, (ఎపేసి6:10-20) విధివిధానాలు తేటతెల్లపరచబడినవి, మన అధిపతియైన రాజు ద్వారా దానిలో పాలుపొందుట పోరాడుట మన యిష్టం మీద ఆధారపడి ఉన్నది.

           మాన అధిపతి రాజు మనకిచ్చిన హెచ్చరికను గ్రహించి, కవచమును ధరించి సిద్ధపడి ఉండాలి. "అందుకు యేసు విశ్వసించిన యూదులతో నామాట మీ యందు ఉండిన యడల మీరు నా శిష్యులై యుందురు. సత్యం మీకు బయలుపరచబడును. సత్యం మిమ్మును స్వతంత్రులుగా చేయును. (యెహోను 8:31;32) ఈ యుద్ధంలో జట్టి అయిన సైనికుడు వుంటాడు మరియు పోరాటమును విస్మరించి ప్రక్కకు తొలగిపోయే సైనికుడు కూడా ఉంటాడు. ప్రభువు ఇట్టివారిని గూర్చి (లూకా 9:57-62) లో గుర్తు చేస్తాడు. కొందరు లోబడి వుంటారు మరికొందరు విరోధభావంతో వుంటారు. ఈ విషియం ప్రతి వారు వారి హృదయలో ముందుగానే నిచ్ఛయించుకుంటారు.

       ఒకవేళ నేను నమ్మకమైన సంసిద్ధత కలిగిన యుద్ధ సైనికుని కాను, నేను సరియైన శిక్షణ పొందలేదు, శరీకముగా మానసికంగా సిద్ధంగా లేను, శత్రువుయొక్క పన్నాగాలను అర్థం చేసుకోలేను,నాకు సిద్ధం చేసిన కిరీటం లేక బహుమతి నిజం కాదు అంటే గోప సైనికునిగా ఉండాలన్న కోరిక యిచ్చ నాకు లేదు అని అర్థము చేసుకోవాలి.

      కాని నేనైతే నా ప్రభువు కొఱకు నమ్మకమైన సైనికునిగా వుండాలని నిచ్చయించుకున్నాను. అంతేకాదు విరోదియొక్క తంత్రములను కనుగొణుచు నీతి అను పైవస్త్రము ధరించి సత్యము, రక్షణ కలిగి సమాధాన సువార్త అను జోడు ధరించి నా హృదయమును మనసును సిద్ధపరుచుకొందును. నేను శిక్షణ కొరకు సిద్ధమనస్సు కలిగి, నా సమయమును బలమును, కోరికలను పొందబోవు విజయము కొరకు త్యాగము చేస్తాను.

       ఈ యుద్ధంలో ఒకవేళ ఓడిపోతే ఎదుర్కొనబోయే ప్రమాదాలు జ్ఞాపకం చేసుకుంటాను.ఒకవేళ యుద్ధంలో గెలుపు వరిస్తే నాకు అలంకరింపబడబోవు కిరీటమును నా కన్ను ఊగించలేని మహాత్తరమైన సమయం.

       విజయమా, అపజయమా అనునది ప్రతిఒక్క సైనికుని హృదయ తీర్మానం మీద ఆధారపడి వున్నది.

Next
Next

నేను సమర్థుడనా?