నేను సమర్థుడనా?
క్రీస్తు నాయొక్క రక్షణ, నిరీక్షణ అని నేను కనుగొన్నాను, నమ్మాను. ఆయన పరిచర్యలో ఆయన మహిమ కొరకు జీవించాలని ఆశ కలిగి యున్నాను. కానీ క్రీస్తుకు నిజ శిష్యునిగా నమ్మకమైన సైనికునిగా వుండగలిగే సామర్ధ్యం నాకు ఉందా? ఎందుకని నాలో ఉన్న అజ్ఞానపు తెరలు, బలహీనతలు, జీవితంలో నేనేందుర్కొంటున్న అడ్డంకులు, అబ్యఅంతరాలు గతించిన జీవితంలో ఎదుర్కున్న చేదు అనుభవాలు, నాసామర్ద్యమును శంకింప జేస్తున్నాయి. ఈ ప్రశ్నలు ప్రతి ఒక్కరు జీవితంలో ఏదో ఒక సమయంలో వస్తూ మన శక్తి సామర్ధ్యాలను బలహీనపరుస్తాయి. నా మట్టుకు నా పరిచర్యను పరిశీలించి చూస్తే ఒక మంచి దీరుడైన సైనికునిగా నేను లేననిపిస్తుంది.
బైబిలు గ్రంధములో ఇద్దరు వ్యక్తులు మోషే మరియు పేతురు ను గురించి చెప్పబడిన విషియములు గమనిద్దాం. ఇద్దరు గొప్ప విశ్వాస వీరులుగా గొప్ప నాయకులుగా చెప్ప బడ్డారు. వీరిద్దరూ దేవునికి పరాక్రమ వంతులైన సైనికులే గాని వీరి జీవిత ఆరంభం మరొక విధంగా ఉంది. వారి మార్గంలో వ్యత్యాసం ఏమిటి?
మోషే పరో ఇంటిలో రాజకుమారుని హోదాలో పెరిగినాడు. కానీ ఇశ్రాయేలీయులు తన స్వకీయ జనాంగమని గుర్తించి ఐగుప్తు రాచరికపు బోగబాగ్యాలు విడిచి పెట్టి తాను ఇశ్రాయేలీయుల లో ఒకడిగా పిలువబడుటకు నిర్ణయించుకున్నాడు (హేబ్రీ11:23-38) దేవుడు అబ్రాహాము యొక్క వంశస్తులకు వాగ్దానభూమి ఇస్తానని చెప్పిన విషియము మోషేకు ఇశ్రాయేలీయుల కు తెలుసు కానీ ప్రస్తుతం ఇశ్రాయేలీయులు బానిసత్వం లో వున్నారు మరి మోషే దేశం విడిచి పారిపోయిన పరిస్థితుల్లో వున్నాడు.
దేవుడు మోషేతో మండుచున్న పొడలోనుండి మాట్లాడినాడు కానీ ఆపోద దహించ బడలేదు. మరియు నేను అబ్రాహాము ఇస్సాకు యాకోబు దేవుడను, నేను ఇశ్రాయేలీయుల మొఱ్ఱ విన్నాను వారిని ఐగుప్తులో నుండి విడిపించుటకు మోషేను నాయకునిగా నియమించి యున్నానని పలికెను. తాను నాయకుడుగా ఉండుటకు ఏమాత్రం సముఖత ధైర్యము లేక దేవుని ప్రశ్నిస్తూ అనేక సాకులు చెబుతూ మఱియుకని ఎన్నుకోమని దేవుని వేడుకోసాగాడు. కానీ దేవుడు మోషేతో అనేక విధాలుగా ఒప్పించి తన శక్తిని మోషేకు అగుపరిచి అనేక రకములుగా నాయకత్వం చేపట్టుటకు అబ్యాసాలు చేయించాడు. (నిర్గమ కాండము 3:1-4;17) మోషే ఐగుప్తుకు వెళ్లి తనపని ఆరంభించుచున్నాడు గాని ఇశ్రాయేలీయుల జీవితాలు మరింత దుర్భరంగా మారాయి. ఇవి చూసి మోషే తన శక్తిని శంకించి దేవుని ప్రశ్నించాడు. దినములు గడిచే కొద్ది మోషే దేవుని సూచనలు, మాటలకు విధేయత చూపుట వెనుక దేవుని శక్తిని అనుభవిస్తూ వచ్చాడు. దేవుడు అనేక రకాల తెగుళ్లను పంపినప్పటికి ఫరో హృదయం కఠినమవుతూ ఉంది కాని మోషే మరింత ఉక్రోశముతో పోరాడుతూ ఉన్నాడు. చివరకు దేవుని నడిపింపుతో మోషే తన ప్రజలను ఐగుప్తులోనుండి విడిపించి బయటకు రప్పించాడు. ఈ ప్రయాణముతో అత్యంత ఉత్కంఠ కరమైన క్షణం- ముందు ఎఱ్ఱసముద్రము వెనుక ఫరో సైన్యము! అప్పుడు మోషే ఇశ్రాయేలీయుల తో యిట్లనెను భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడు చూడరు (నిర్గమ కాండము 14:13;14)
అరణ్యమందు మీరు కొత్త రాజ్యముగా కొనసాగించుచుండగా మోషే వీరిని నడిపిస్తూ, న్యాయాన్యాములు పరిశీలిస్తూ, మార్గము నిర్దేశిస్తూ వారి కొరకు దేవుని యొద్ద విజ్ఞాపన చేస్తూ వున్నాడు.
ఒకప్పుడు మిద్యానులో సందేహాలతో సాకులు చెప్పిన మోషే వాగ్దాన భూమి సమీపించు సమయానికి ఇశ్రాయేలీయుల ప్రజలు పక్షంగా పర్వతము మీద పోరాడుటకు ఒక పరాక్రమ సైనికునిగా ఉద్బవించాడు.
పేతురు క్రీస్తు పన్నెండు మంది శిష్యులలో ఒకడు కాని దినములు గడిచినకొద్ది దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించు అపొస్తలుడు గా మారి యున్నాడు. ముమోషేకు బిన్నంగా పేతురు క్రీస్తును వెంబడించుటకు ఎంతో ఉత్సుకతతో వున్నాడు. పేతురు వినిన భోదలు చూసిన అద్భుతాలు లెక్క తెలియదు గాని క్రీస్తు తనను వెంబడించమని కొరినప్పుడు తన జీవితానికి సంబంధించిన పనులను బాధ్యతలను ప్రక్కన పెట్టి వెంబడించాడు (మత్తయి 4:18;19) పేతురు ఎంతో ఉత్సాహంగా, ఒప్పింపబడి హృదయపూర్వకంగా పని చేసేవాడు.
ఒకసారి క్రీస్తు శిష్యులతో అన్నాడు ఇతరుల వలె మీరందరు నన్ను విడచి వెళ్లిపోతారా? అంటే పేతురు ఇట్లన్నాడు మేము ఎవరియొద్దకు వెళ్ళము నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు.(యెహోను 6:68)
నేను ఎవరిని అని మీరనుకొనుచున్నారు? అని క్రీస్తు అడుగగా "పేతురు నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువని" చెప్పెను. (మత్తయి16:16) అయినను పేతురు తనముందున్న కార్యాచరణము కొరకు సిద్ధంగా లేడు.
ఇశ్రాయేలీయుల యడల క్రీస్తు ఉద్దేశ్యం ఆయన రాజుగా వుండబోయే రాజ్యం గురించి పేతురుకు ఎంతమాత్రం అవగాహన లేదు.
క్రీస్తు పేతురితో ఏంతో ఓర్పు కలిగి పనిచెస్తూ అతనికి అనేక విషియాలు గురించి నేర్పించి, కొన్ని సమయాల్లో గద్దిస్తూ తన విశ్వాససములో వేస్తున్న తప్పటడుగులును సరిదిద్దుతూ వచ్చాడు.
క్రీస్తు రక్షణను గూర్చి, నిరీక్షణను గూర్చిన సందేశాలను గ్రహిస్తు పేతురు తన పరిచర్యను కొనసాగించాడు.
పొంగుచున్న సముద్రపు కెరటాలమీద నడిచి వస్తున్న యేసును చూసి, గొప్పవిశ్వాసముతో నేను కూడ నడుస్తానని నడవ సాగాడు. కానీ సముద్ర కెరటాలు వైపు కన్నులు చూడటంతోమునిగిపో సాగాడు (మత్తయి 14:28-30) ఒక సందర్భంలో పేతురు మానవ స్వభావంతో ఆలోచించి యేసు బలియాగము విషియములో నీకు మరణం దూరమవును గాక అని ఆవేశముతో పలికాడు. (మత్తయి 16:21-23) యేసు తాను పరిచర్య చేయుటకు వచ్చాడు అన్న విషియం నిరూపించుటకు అందరి పాదములు ఒక దాసుని వలే కడుగుచుండగా పేతురు తన పాదములు కడుగవద్దని యేసును నివారించాడు (యెహోను13:8)
గెత్సమనే తోటలో యేసు శిష్యులతో కలిసి ప్రార్దించుటకు పోవుచుండగా పేతురు తన ప్రాణము పెట్టుటకు యేసు కొరకు ఒట్టు పెట్టినాడు కానీ ఆయనతో కూడా ప్రార్ధించలేక నిద్రలోకి జారుకున్నాడు (మత్తయి 26:33-35)
యేసుని కొనిపోవుటకు గుంపు దొమ్మిగా వచ్చినప్పుడు ఎంతో దైర్యంగా వారిని అడ్డగించాడు కానీ వారు యేసుని పట్టుకొని తీసుకొని పోయిన తరువాత, తనను కూడా అదేవిధంగా చేయవచ్చునని భయపడి కంగారుపడి యేసుని ఎరుగనని తనను తాను శపించుకొనసాగాడు(యెహోను18:10;15:27)
కొన్నిదినములు అయిన తరువాత యేసును ఉంచిన సమాధి యెద్దకు పరుగెత్తి అది కాళీగావుండుట చూసాడు. యేసు తాను మూడవ దినమున తిరిగి లేచెదనన్న మాటయొక్క నెరవేర్పును గ్రహించసాగాడు(యెహోను20:1-10)
పెంతికొస్తు దినమున పరిశుద్ధాత్మ బలముగా దిగివక్చినప్పుడు పేతురు అత్యంత ధైర్యముతో దృఢమైన మనస్సుతో యేసు ప్రభువని, క్రీస్తు అని ఈయన మీరు సిలువ వేసిన యేసు అని ప్రకటించాడు.(అపో2:36)
ఈ సువార్తను పేతురు యూదులకు, కఠిన హృదయులైన నాయకులకు, అన్య జనులకు, రోమా సైనికులకు మరి తన ఇంటివారందరికి ప్రకటించుచుండెను. ఒకప్పుడు యేసుని ఎరుగనని పారిపోయిన ఈ పేతురు తన యేసు కోరకు హింసింపబడుటకు సంతోషముగా ముందుకు అడుగులు వేసాడు. మీరుకూడా క్రీస్తు కొరకు ఈ విదంగా శ్రమలు సహించుడి అని ఉత్తరం వ్రాస్తూ అన్నాడు.(అపో 5:41;2పేతురు4:12-14)
ఎందుకంత మార్పు వారిలో? ఇది ప్రభువు యొక్క కార్యమే, సందేహము లేదు గమనిస్తే వారిద్దరూ దేవునితో అనుదినము మానక సహవాసం కలిగి యున్నారు. వారు ఆయన మాటను ఆజ్ఞను విన్నారు, లోబడ్డారు. ఆయన శక్తి కలిగిన కార్యాలు వారి జీవితాల్లో అనుభవించసాగారు, మరియు అధికముగా ఆయన యందు విశ్వాసం ఉంచుటకు నేర్చుకున్నారు. ముఖ్యంగా ఆయన శక్తిని ప్రణాలికను గ్రహించుకున్నారు.
మన నిరీక్షణ ఇదే; దేవుని సహవాసములో ఎదుగుట, ఆయన మాట ఆలకించుట, విధేయత చూపుట, విశ్వసించుట మనబలహీనతలు ఎరిగియుండుట, దేవుని చిత్తమును శక్తిని ప్రణాళికలకు హృదయాన్ని సిద్ధపరుచుట అనునది. దానికి "నేను సమర్థుడనా" అను మాటకు మన హృదయం జవాబును పొందినది. ఇప్పుడు నేను ధైర్యముతో చెప్పగలను. "నేను క్రీస్తుతో కూడా సిలువవేయబడి యున్నాను" ఇకను జీవించుట నేను కాదు క్రీస్తే నాయందు (కొలస్స2:20)-->జీవించుచున్నాడు